దేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు పాప
deevaputrulandarru entoo bhaagyavantulu paapa
పల్లవి
దేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు పాప మరణాదులు పరిహారమాయెను. ||దేవపుత్రులందఱు ఎంతో||
1వ చరణం
వారు క్రీస్తువల్లనే ఐరి నీతిమంతులు స్ధిరమైన నెమ్మది భక్తులందరొందరి.
2వ చరణం
తండ్రి యొద్ద పిల్లలు నిర్భయాళులౌదురు వారు కూడ దేవునిన్ చేర భయపడరు.
3వ చరణం
వారి కెట్టి కష్టముల్ హానిచేయ నేరవు వారికిన్ నిజంబుగా శ్రమ యుపయోగము
4వ చరణం
ఇహమందు కరుణ చావువేళ నెమ్మదిది పరమందు భాగ్యము వారికిన్ సంపూర్ణము.