యేసు నన్నుఁ బ్రేమించి దాసు

yeesu nannun breeminchi daasu

🎵 AKK-558💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు నన్నుఁ బ్రేమించి దాసు నన్నుఁ బిల్చెను ఈ సత్యంబు బైబిలు తేటగాను దెల్పెను. ||యేసు నన్నుఁ||

1వ చరణం

బాలురమౌ మమ్మును బాగుగాఁ ప్రేమించును శక్తిలేనివారము బలవంతుఁ డేసుఁడు.

2వ చరణం

బుద్ధిలేని వారికిఁ తాను బోధపర్చును శుద్ధిలేని వారిని శుద్ధిఁ జేసి ప్రోచును.

Report Error