ప్రభు మార్గములయందె భయభక్తి నిందు
prabhu maargamulayande bhayabhakti nindu
ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు ||ప్రభు మార్గములయందె||
అపుడు నీచే కష్టం బారగించుదువు ఎపుడు ధన్చుడవు నీ కిలమేలౌ గాక ||ప్రభు మార్గములయందె||
నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ గెల పోలి నీ భార్య ఫలమిచ్చును గాక ||ప్రభు మార్గములయందె||
పిల్లలిప్ప మొక్క పెంపువలె నీదు బల్లజుట్టుకొని శో భిల్లుదురు గాక ||ప్రభు మార్గములయందె||
ప్రభున కిదిగో భీతి పడువాడీరీతి విభవంపు దయనొంది వికసించునుగాక ||ప్రభు మార్గములయందె||
ప్రభు సీయోనునుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి బ్రతికించునుగాక ||ప్రభు మార్గములయందె||
అరయ బ్రతికెడు రోజు లన్నిట నీవు యెరుషలేము క్షేమంబు నెపుడు జూచెదవు ||ప్రభు మార్గములయందె||
నీదు పిల్లల పిల్లలు నిజామిశ్రాయేలు మీది క్షేమముజూచి మోదమొందెదరు ||ప్రభు మార్గములయందె||
తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములం దుండుగా కామేన్ ||ప్రభు మార్గములయందె||