మేమిచ్చు కానుకల్ నీవే మాకిచ్చితి
meemichchu kaanukal neevee maakichchiti
పల్లవి
మేమిచ్చు కానుకల్ నీవే మాకిచ్చితి మా యాస్తియంత ప్రభువా నీ దానమే గదా.
1వ చరణం
నీ వుచితంబుగా మా కిచ్చువాడవు అన్యుల కుచితంబుగా మేమిచ్చుచుందుము.
2వ చరణం
సర్వత్ర బీదలు అన్నంబునొందరు కన్నీళ్లు రాల్చు ప్రజలు అనేకులుందురు.
3వ చరణం
ఈలాటివారికి సహాయమిచ్చుట దూతలు చేయు సేవకు సమానమగును.
4వ చరణం
పోషించి బీదలన్ రక్షించి పాపులన్ అందరిన్ సంరంక్షించుట శ్రీ యేసు కార్యమే.
5వ చరణం
నా బీదవారికి నీవిచ్చు దానము నా కిత్తువను వాక్యము శ్రీ యేసు చెప్పెను.