సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే
saarvajagatiki sanrakshakudu svaami yehoovaayee
పల్లవి
సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద ధారుణీ స్థలిని ధనధాన్యములనుఁ దొలి దానము తనకీయగరాదా ||సార్వజగతికి సంరక్షకుడు||
1వ చరణం
ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ ఆదర్శముగాఁ మనకిడెగా ఆది సంభవుని కతి మోదంబున సేద్య ఫలంబులు తేవలదా ||సార్వజగతికి సంరక్షకుడు||
2వ చరణం
కానుకలీయరె మానితులారా కన్యకుమారుని భజియింపన్ మానవ పున్రుత్థాన మహిమలో మన ప్రథమ ఫలంబతడౌర ||సార్వజగతికి సంరక్షకుడు||
3వ చరణం
ఉభయజగాల సర్వోన్నతు డాయనే శుభకరు డన నొప్పును గాదె ప్రభుని పేర పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె ||సార్వజగతికి సంరక్షకుడు||