ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని

ee gudiyandu praveeshinpan yeesuni

🎵 AKK-585💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని బిలువగ రారండి ఆయన రానిదె దీవెనలు ఆశీర్వాదము లరుదగును ||ఈ గుడియందు||

1వ చరణం

ఆకా శము మన దేవునికి అత్యున్నత సింహాసనము పాదములకు యీ భూమియును పీఠముగా నొప్పును సుమ్ము ||ఈ గుడియందు||

2వ చరణం

ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై ||ఈ గుడియందు||

3వ చరణం

నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన సువార్తికుల బోధను నాటగ జేయుటకు ||ఈ గుడియందు||

4వ చరణం

ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు ||ఈ గుడియందు||

5వ చరణం

ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు ||ఈ గుడియందు||

6వ చరణం

బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు భోజన సంస్కారములు బాగుగ జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు ||ఈ గుడియందు||

7వ చరణం

తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన వర్షములు దీనిపై నిరతము కురియుగాక ||ఈ గుడియందు||

Report Error