యేసువ జయముతో యెరుషలేమున బ్ర

yeesuva jayamutoo yerushaleemuna bra

🎵 AKK-593💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా ||యేసువ జయముతో||

1వ చరణం

మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ జయముతో||

2వ చరణం

పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ జయముతో||

3వ చరణం

కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ జయముతో||

4వ చరణం

యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా ||యేసువ జయముతో||

5వ చరణం

మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా మా కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ జయముతో||

6వ చరణం

మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా సాదర వాక్కులు చక్కఁగఁ బలికియు నాదరించుమము నో ప్రభువా ||యేసువ జయముతో||

Report Error