దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని

daivapreema manalanepudu bandhinchugaa divini

🎵 AKK-604💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని దీన జనులను దిరముగా కాపాడుగా ||దైవప్రేమ మనలనెపుడు||

1వ చరణం

పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల మార్గములలో ప్రభువే తోడైయుండుగా ||దైవప్రేమ మనలనెపుడు||

2వ చరణం

నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ||దైవప్రేమ మనలనెపుడు||

3వ చరణం

మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ||దైవప్రేమ మనలనెపుడు||

4వ చరణం

జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా ||దైవప్రేమ మనలనెపుడు||

Report Error