ముందు కందరును జేరను ఎందు

mundu kandarunu jeeranu endu

🎵 AKK-607💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ముందు కందరును జేరను ఎందు బోయినన్ గాపాడి తొందరల్మ ఱేమ్మిరాక బంధుఁడేసు నిన్ను గావుతన్ ||ముందు కందరును||

1వ చరణం

ఱెక్క నీడ నిన్నుఁ జేర్చుచు మిక్కుటంపు ప్రేమఁజూపిఁ చిక్కులాప తిల్లకుండ మక్కువన్ ప్రభుండుగావుతన్

2వ చరణం

నాఁడు నాడాహారమిచ్చుచు వేడుకన్ గౌగిటఁ జేర్చి కీడులందు నిన్ను గాంచి ఱేడునిన్నుఁ బ్రోచికావుతన్

3వ చరణం

చావు యొక్క భీతిలేకను జీవమార్గమందుఁ దోడై రేవుఁజేరుఁదాక బ్రోచి పావనుండు నిన్ను గావునన్

Report Error