దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ

deeshaseevanjeesi deeva daasulai vardhillun

🎵 AKK-608💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను వీడి యేసుని నిజదాసు లగుఁడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో ||దేశసేవఁజేసి దేవ||

1వ చరణం

దేశ బంధువు యేసువే మన దేశ రక్షకుఁ డాయనే దేశ మంత యేసు మనసుతో నాశతో సేవించుడి ||దేశసేవఁజేసి దేవ||

2వ చరణం

నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలఁగియు నిత్య ప్రేమ చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు ||దేశసేవఁజేసి దేవ||

3వ చరణం

వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు వినయ విధము లేక మేలు లేదు ||దేశసేవఁజేసి దేవ||

4వ చరణం

ప్రేమఁ గలగి పరమ సత్య ప్రేమ సేవఁ జేయుఁడి ప్రేమమూర్తి యేసుకీస్తు ప్రేమలలో వర్ధిల్లుఁ డిలలో ||దేశసేవఁజేసి దేవ||

5వ చరణం

ఆసేతు హిమాచల ప ర్యంతమున్ దిగంతము లేకముగను దివిని భువిని సేలు రాజు యేసుఁడే ||దేశసేవఁజేసి దేవ||

Report Error