అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య!

andhudaa raavaa aramarayeela adugoonayya!

🎵 AKK-627💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...

1వ చరణం

నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె... ||అంధుడా రావా||

2వ చరణం

మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అంధుడా రావా||

3వ చరణం

ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||అంధుడా రావా||

4వ చరణం

లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||అంధుడా రావా||

5వ చరణం

పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే ||అంధుడా రావా||

6వ చరణం

హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అంధుడా రావా||

Report Error