ఆనందం ఆనందం దినదినం ఆనందం
aanandan aanandan dinadinan aanandan
పల్లవి
ఆనందం ఆనందం దినదినం ఆనందం యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను(2)
1వ చరణం
తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు దూరంపోయిన కనుగొన్నాడు(2) తన ప్రాణమును నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను ||ఆనందం ఆనందం||
2వ చరణం
ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు వచ్చువరకు కాచుకొందును ||ఆనందం ఆనందం||
3వ చరణం
ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆనందం ఆనందం||