ఇదియే సమయంబు రండి యేసుని

idiyee samayanbu randi yeesuni

🎵 AKK-633💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి

1వ చరణం

పాపులనందరిని తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా ||ఇదియే సమయంబు||

2వ చరణం

రాజుల రాజైన యేసు రానై యుండేనుగా గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ||ఇదియే సమయంబు||

3వ చరణం

బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి ||ఇదియే సమయంబు||

4వ చరణం

వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను మీరెవరో పొమ్మనును ||ఇదియే సమయంబు||

5వ చరణం

సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇదియే సమయంబు||

6వ చరణం

సందియ పడకండి మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ ||ఇదియే సమయంబు||

7వ చరణం

జాలము చేయకను మెరు హేళన చేయకను కులము స్థలమనుచూ మీరు కాలము గడువకనూ తరుణముండగానే మీరు త్వరపడి రారండి ||ఇదియే సమయంబు||

Report Error