ఓ యేసు నీ ప్రేమ

oo yeesu nee preema

🎵 AKK-641💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది

1వ చరణం

ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ||ఓ యేసు||

2వ చరణం

సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొర్రకుముందె తోడనుందునంటివీ (2) ||ఓ యేసు||

3వ చరణం

మరణాంధకారపు లోయనే సంచరించన నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు||

4వ చరణం

కొదువలెన్ని యున్న భయపడ నే నిపుడు పచ్చిక బయలులో పరుండజేయును భోజన జలములతో తృప్తిపరచును నాతో నుండు నేను (2) ||ఓ యేసు||

5వ చరణం

దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూ ఆమేన్ (2) ||ఓ యేసు||

Report Error