క్రైస్తవకర్షక కదిలిరావయ్యా కన్నులు తెరచి

kraistavakarshaka kadiliraavayyaa kannulu terachi

🎵 AKK-646💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రైస్తవకర్షక కదిలిరావయ్యా కన్నులు తెరచి కానవేమయ్యా

1వ చరణం

మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును విత్తెమున్న భూలోకంబనెడు పొలంబునందున వాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవకర్షక కదిలిరావయ్యా||

2వ చరణం

ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు విత్తె రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను దానంబుజేసిరి ||క్రైస్తవకర్షక కదిలిరావయ్యా||

3వ చరణం

చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవకర్షక కదిలిరావయ్యా||

4వ చరణం

పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని కోతవారిని పంప కోరివేడుదం ||క్రైస్తవకర్షక కదిలిరావయ్యా||

5వ చరణం

శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె గోధుమల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను పెరుగుచుండెను ||క్రైస్తవకర్షక కదిలిరావయ్యా||

6వ చరణం

కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా కలవర మొందెద వెందులకు సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదుము ఆగిపోకను ||క్రైస్తవకర్షక కదిలిరావయ్యా||

Report Error