కృపామయుడా నీలోన(2) నివసింపజేసినందునా ఇదిగో
krupaamayudaa neeloona(2) nivasinpajeesinandunaa idigoo
పల్లవి
కృపామయుడా నీలోన(2) నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో
1వ చరణం
ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపామయుడా నీలోన(2)||
2వ చరణం
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజ వంశములో యాజకత్వము చేసెదను ||కృపామయుడా నీలోన(2)||
3వ చరణం
నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపామయుడా నీలోన(2)||
4వ చరణం
ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను ||కృపామయుడా నీలోన(2)||