దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు(3)

deevudu manaku ellappudu tooduganunnaadu(3)

🎵 AKK-657💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు(3)

1వ చరణం

ఏదేనులో ఆదాముతో నుండెన్ హానోకుతోడ నేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు ||దేవుడు మనకు||

2వ చరణం

దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ నబ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు ||దేవుడు మనకు||

3వ చరణం

యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయపుడు ||దేవుడు మనకు||

4వ చరణం

ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసంద్రపు తీరమున యోర్దానునది దాటినపుడు ఎరికో కూలినయపుడు ||దేవుడు మనకు||

5వ చరణం

దావీదు సింహాము నెదరించి ధైర్యాన చీల్చిన యపుడు గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరుమబడి నపుడు ||దేవుడు మనకు||

6వ చరణం

సింహపుబోనులో దానియేలు షద్రకు మేషాకబెద్నెగో అగ్ని గుండములో వేయబడున్ నల్గురుగా కనబడినపుడు ||దేవుడు మనకు||

7వ చరణం

పౌలు బంధించబడినపుడు పేతురు చెరలోనున్నప్పుడు అపోస్తలుల విశ్వాసులు హింసింపబడిన యపుడు ||దేవుడు మనకు||

Report Error