నీ చేతితో నన్ను పట్టుకో

nee cheetitoo nannu pattukoo

🎵 AKK-669💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము

1వ చరణం

అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యమ శక్తిగలది నాత్రోవకు నిత్యవెలుగు ||నీ చేతితో||

2వ చరణం

ఘోరపాపిని నేను తండ్రి పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ చేతితో||

3వ చరణం

ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవచేసెదన్ ||నీ చేతితో||

Report Error