యేసు చాలును యేసు చాలును

yeesu chaalunu yeesu chaalunu

🎵 AKK-671💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు చాలును యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును

1వ చరణం

పరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు చాలును||

2వ చరణం

సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు చాలును||

3వ చరణం

పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు చాలును||

4వ చరణం

నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు చాలును||

Report Error