ప్రజలమే వేగమె రారె నిజదైవమును
prajalamee veegame raare nijadaivamunu
పల్లవి
ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె ||ప్రజలమే వేగమె||
1వ చరణం
పాపాత్ములనబడు వారి భారంబు దీయనుగోరి ప్రభుయేసు జూపినదారి పరమందు సుఖమిడుదారి ||ప్రజలమే వేగమె||
2వ చరణం
ఏ జాతివారలనైనన్ యే దేశవాసులనైనన్ యేమైన బేధము లేక యేసయ్య బ్రోచునువేగ ||ప్రజలమే వేగమె||
3వ చరణం
పాపాత్ములే తన సుతులు ప్రభు యేసునికి స్నేహితులు నీ పాపమెల్లను బోయెన్ నీకింక మోక్షము కలుగున్ ||ప్రజలమే వేగమె||
4వ చరణం
ప్రయాసపడి భారమును మోసెడు ఓ ప్రజలారా ప్రభుయేసుక్రీస్తే మీకు విశ్రాంతి నిచ్చునురండి ||ప్రజలమే వేగమె||
5వ చరణం
యేసయ్యగాకను వేరే యెవరైన లేరిక రారే దోషంబులలెల్నను బాపి ఆశీర్వదించునుగాచి ||ప్రజలమే వేగమె||