ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా
priyayeesu nirminchitivi priyamaara naa
పల్లవి
ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున
1వ చరణం
నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రీ ప్రతిపాపమును కడిగి ||ప్రియయేసు నిర్మించితివి||
2వ చరణం
అజాగరూకుడనైతి నిజాశ్రయమువిడిచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ||ప్రియయేసు నిర్మించితివి||
3వ చరణం
వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనె చేరితి నీదుదారి కోరి నడిపించుము ||ప్రియయేసు నిర్మించితివి||