యెహోవా నా బలమా యధార్థమైనది
yehoovaa naa balamaa yadhaarthamainadi
యెహోవా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ||యెహోవా నా||
నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన వదలక నను ఎడబాయని దేవా ||యెహోవా నా||
మరణపు టురువులు మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొరవినెను అదిరెను ధరణి భయకంపముచే ||యెహోవా నా||
నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ జేయున్ జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||యెహోవా నా||
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించివేసెను వైరుల నెల్లను ||యెహోవా నా||
మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా నా||
దయగలవారిపై దయచూపించును కఠినుల యెడల వికటము జూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా నా||
నా కళ్ళను లేడికాళ్ళగ జేయును యెత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా నా||
యెహోవా జీవము గల దేవా బహుగ స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యతజూపుచు హల్లెలూయా స్తుతిగానము జేసెద ||యెహోవా నా||