అమూల్య రక్తం – ప్రశస్త
amuulya raktham – prashastha
🎵 TG-1526🌐 Telugu
పల్లవి
అమూల్య రక్తం – ప్రశస్త రక్తం విలువైన రక్తం – శక్తి గల రక్తం (2) యేసు రక్తమే జయము క్రీస్తు రక్తమే విజయము పాప క్షమాపణ యేసు రక్తములోనే శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య||
1వ చరణం
తండ్రి చిత్తము నెరవేర్చ గెత్సేమనేలో ప్రార్ధింప చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు||
2వ చరణం
శాపానికి ప్రతిఫలము ముళ్ళు ముండ్ల కిరీటముతో చెల్లు ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు||
3వ చరణం
నీ చేతుల పనిని ఆశీర్వదింప ప్రభు చేతులలో మేకులు గొట్ట కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను