అందాల తార అరుదించెనాకై - అంబర వీధిలో
andaala taara arudinchenaakai - anbara viidhiloo
పల్లవి
అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవనిజాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగెనాలో - అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు - పయనమైతిని "అందాల"
1వ చరణం
విశ్వాశయాత్ర దూరమెంతైన - విందుగదోచెను వింతైన శాంతి వర్షించెనాలో - విజయ పధమున విశ్వాలనేలేడి దేవ కుమారుని - వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ "అందాల"
2వ చరణం
యెరూషలేము రాజనగరిలో - యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి యేసయ్య తార యెప్పటివోలె - ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు - యేగితిస్వామి కడకు "అందాల"
3వ చరణం
ప్రభు జన్మ స్థలము పాకయేగాని - పరలోక సౌధమే బాలుని జూడ జీవితమంత - పావనమాయెను ప్రభు పాద పూజ ధీవెనకాగ - ప్రసరించె పుణ్యము బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన "అందాల"