అంకితం ప్రభూ నా జీవితం
ankitham prabhuu naa jeevitham
🎵 TG-2776🌐 Telugu
పల్లవి
అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2) నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
1వ చరణం
కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు