అంత్య దినమందు దూత బూర

anthya dinamandu duutha buura

🎵 TG-497💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

అంత్య దినమందు దూత బూర నూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ ||అంత్య దినమందు||

1వ చరణం

క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్. ||అంత్య దినమందు||

2వ చరణం

కాన యేసుసేవ ప్రత్య హంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ ||అంత్య దినమందు||

Report Error