అపరాధిని యేసయ్య కృప జూపి
aparaadhini yeesayya krupa juupi
అపరాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు ||అపరాధిని యేసయ్య||
సిలువకు నిను నే గొట్టితిని తులవలతో జేరితిని కలుషంబులను మోపితిని దోషుండనేను ప్రభువా ||అపరాధిని యేసయ్య||
ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో ||అపరాధిని యేసయ్య||
ముళ్లతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ ||అపరాధిని యేసయ్య||
దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితినీ దేహంబుగాయంబులను ||అపరాధిని యేసయ్య||
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని క్రూరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా ||అపరాధిని యేసయ్య||
చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత నిందలు పెట్టితినయ్యో సందేహమేలనయ్యా ||అపరాధిని యేసయ్య||
శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా ||అపరాధిని యేసయ్య||