అపరాదిని యేసయ్యా - కృప జూపి బ్రోవుమయ్యా

aparaadini yeesayyaa - krupa juupi broovumayyaa

🎵 TG-1018💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు

1వ చరణం

సిలువకు నిను నే గొట్టితిని - తులవలతో జేరితిని కలుషంభులను మోపితిని - దోషుండనేను ప్రభువా

2వ చరణం

ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యా

3వ చరణం

ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ

4వ చరణం

దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితినీ - దేహంబుగాయములను

5వ చరణం

గోరంబుగా దూరితిని -నేరంబులను జేసితిని క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా

6వ చరణం

చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా

7వ చరణం

శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా అక్షయభాగ్యము నియ్యా - మోక్షంబు జూపితివయ్యా (సిరిపురపు కృపానందము )

Report Error