అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని
apu darchakaadu luppongiri prabhuni
పల్లవి
అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు సిల్వమానిపైఁ బ్రభుని వేయుట కొప్పి ||అపు డర్చకాదు||
1వ చరణం
యెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమ సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ గొట్టి ||అపు డర్చకాదు||
2వ చరణం
చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తము నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె ||అపు డర్చకాదు||
3వ చరణం
గడి దొంగ లిరువురుని బట్టిరి ప్రభుని కుడి యెడమలను సిల్వఁ గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు బాధలను మరియ కొడు కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె ||అపు డర్చకాదు||