అయ్యో నాదగు ఘోరపాపము గదా

ayyoo naadagu ghoorapaapamu gadaa

🎵 TG-197💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యము వీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన ||అయ్యో నాదగు||

1వ చరణం

నిరతము దూతానీక మూడిగము నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు నిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ బరమునుండి క్రిందికి దిగలాగిన ||అయ్యో నాదగు||

2వ చరణం

కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను లారఁ చూచుకొన నేరనట్టి యల మేరి గర్భమున దూయఁబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||అయ్యో నాదగు||

3వ చరణం

మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా ||అయ్యో నాదగు||

4వ చరణం

కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ ||అయ్యో నాదగు||

5వ చరణం

ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైనిఁ బెట్టి నీ కండ్ల కొక్క గంతఁ గడ గండు పెట్టఁ గారణము నిజముగా ||అయ్యో నాదగు||

6వ చరణం

ఈపు ప్రాణమును నీవిగ నొసఁగ నీటెతోడఁ బ్రక్కను బొడుచుట హా భావమందుఁ దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ ||అయ్యో నాదగు||

Report Error