బాల యేసుని జూడరే కరు

baala yeesuni juudaree karu

🎵 TG-552💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

బాల యేసుని జూడరే కరు ణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి దేవుడు కొమరుడై జన్మించెనే ||బాల యేసుని||

1వ చరణం

దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు జూచి స్తోత్రగీతముల్ పాడరే ||బాల యేసుని||

2వ చరణం

గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు రక్షణంబని యంతటను చాటించరే ||బాల యేసుని||

3వ చరణం

జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు మానవుండై బుట్టెను ||బాల యేసుని||

4వ చరణం

భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు ప్రభు మన మధ్యనే జన్మించెను ||బాల యేసుని||

5వ చరణం

లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు శ్రీ లొసంగగ వచ్చెను ||బాల యేసుని||

Report Error