బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
baaludu kaadammoo balavanthudu yeesu
🎵 TG-1369🌐 Telugu
పల్లవి
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2) పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు||
1వ చరణం
కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకను చేరామే మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము మా మంచి కాపరని సంతోషించామే సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||
2వ చరణం
చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించామే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము ఇమ్మానుయేలని పూజించామమ్మో (4) ||బాలుడు||