భారత దేశ సువార్త సంఘమా
bhaaratha deesha suvaartha sanghamaa
🎵 TG-1457🌐 Telugu
పల్లవి
భారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమా ధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా ||భారత||
1వ చరణం
ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకై నేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమా అంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమా బ్రతుకులోన ప్రభు శక్తిలేని – క్రైస్తవ జనాంగమును గనుమా కునుకు దివ్వెలను సరిచేయగ – ఉజ్జీవ జ్వాలగొని చనుమా