భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ

bhajanacheeyuchu bhakthapaalaka prasthuthinthu nee

🎵 TG-081💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై జయము నిచ్చిన విజయుఁడా నిను వేఁడుకొందు ||భజనచేయుచు భక్తపాలక||

1వ చరణం

దివ్యపదవిని విడిచి నీవు దీనుఁడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు ||భజనచేయుచు భక్తపాలక||

2వ చరణం

నరులఁ గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుఁడ నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజనచేయుచు భక్తపాలక||

3వ చరణం

చెడినవాఁడ నైన నన్నుఁ జేరఁదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తి నావు ||భజనచేయుచు భక్తపాలక||

4వ చరణం

ఎంత ప్రేమ యెంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబుకాదు ||భజనచేయుచు భక్తపాలక||

Report Error