భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన

bhakthulaaraa smariyinchedamu prabhu cheesina

🎵 TG-2369🌐 Telugu
పల్లవి

భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని (2) అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగ చేసె (2)         ||భక్తులారా||

1వ చరణం

గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు

Report Error