చక్కని పరలోక సంబంధులతో గూడి

chakkani paralooka sanbandhulathoo guudi

🎵 TG-509💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట యెన్నడో మిక్కిలి ప్రియమైన తండ్రి దేవుని యెదుట మ్రొక్కి పాడుట యెన్నడో ||చక్కని పరలోక||

1వ చరణం

నిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు ల త్యుత్తమ పురమున ముత్యాల ద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో ||చక్కని పరలోక||

2వ చరణం

పన్నెండు ద్వారముల పరమపురమును నా కన్నుజూచుట యెన్నడో చెన్ను మీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి సన్నుతించుట యెన్నడో ||చక్కని పరలోక||

3వ చరణం

పరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడో పరిపూర్ణులతోఁ గూడి బహుమానమును బొంది మురియు చుండుట యెన్నడో ||చక్కని పరలోక||

4వ చరణం

మహిమకిరీటము ధరియించియున్న యా మహితు నిగను టెన్నడో అహహా యా ప్రభునితో మహిమపరచబడి మహికేతెంచుట యెన్నడో ||చక్కని పరలోక||

5వ చరణం

పాపశరీరముఁ బాసి ప్రభుని యొక్క రూపునొందుటయెన్నడో పాప మరణ దుఁఖ మీ యాపదల కెడ బాపు నొందుట యెన్నడో ||చక్కని పరలోక||

6వ చరణం

రమ్మురమ్ము యేసు మమ్ము నీ పురముకొని పొమ్ము వేవేగమునే ఇమ్మహికష్టములనుండి నెమ్మది ని త్యమ్ము నిమ్ము వేగమే ||చక్కని పరలోక||

Report Error