చిందింది రక్తం ఆ సిలువ
chindindi raktham aa siluva
🎵 TG-2647🌐 Telugu
పల్లవి
చిందింది రక్తం ఆ సిలువ పైన కారింది రుధిరం కలువరిలోన (2) కరుణ చూప లేదే కసాయి మనుష్యులు కనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది||
1వ చరణం
ఏదేనులో పుట్టిన ఆ పాపము శాపముగా మారి మరణ పాత్రుని చేసె ఆ మరణమును తొలగించుటకు మరణ పాత్రను చేబూనావా నా మరణమును తప్పించినావా ||కరుణ||
2వ చరణం
చేసింది లోకం ఘోరమైన పాపం మోపింది నేరం నీ భుజము పైనా యెరుషలేములో పారిన నీ రక్తము ఈ లోక విమోచన క్రయధనము నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం మరణపు ముల్లును విరిచిన దేవుడా జీవకిరీటము నిచ్చుటకై ముళ్ళ కిరీటము ధరించితివా నాకు నిత్య జీవమిచ్చితివా