చూడ గోరెద దేవ మందిరావరణములను

chuuda gooreda deeva mandiraavarannamulanu

🎵 TG-019💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా ||చూడ గోరెద||

1వ చరణం

నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు నానంద మిచ్చు నిపుడు నెపుడు ||చూడ గోరెద||

2వ చరణం

జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె గూటి తావు నీ మందిరమున ||చూడ గోరెద||

3వ చరణం

పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు కుతూహలముతోను పిల్లల నవి మందిరమున ||చూడ గోరెద||

4వ చరణం

నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్నుతింతు రహా ||చూడ గోరెద||

5వ చరణం

ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ గోరెద||

6వ చరణం

నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న ||చూడ గోరెద||

7వ చరణం

కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక ||చూడ గోరెద||

Report Error