చూడరే క్రీస్తుని జూడరే నా
chuudaree kreesthuni juudaree naa
పల్లవి
చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో ||చూడరే క్రీస్తుని||
1వ చరణం
మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది ||చూడరే క్రీస్తుని||
2వ చరణం
మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ బ్రాణము లుండునే యిఁకఁ ||చూడరే క్రీస్తుని||
3వ చరణం
ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ జేసిరి ||చూడరే క్రీస్తుని||