డాగు నేది మాపును వేగ

daagu needi maapunu veega

🎵 TG-341💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

డాగు నేది మాపును వేగ యేసు రక్త ధారే రోగి కేయౌషథము బాగుగా నా రక్త ధారె ||డాగు నేది||

1వ చరణం

పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారె శాపపు సంహారము స్వామి యేసు రక్త ధారె ||డాగు నేది||

2వ చరణం

ఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్తధారె నాదు క్షమాపణము సాధు వేసు రక్త ధారె ||డాగు నేది||

3వ చరణం

నాకు సమాధానము నాధుఁ డేసు రక్త ధారె సాకు నేను గానను జయ యేసు రక్త ధారె ||డాగు నేది||

Report Error