దాపుఁజేరుచుఁ బాడుము జీవపు మాటలన్

daapumjeeruchum baadumu jeevapu maatalan

🎵 TG-354💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దాపుఁజేరుచుఁ బాడుము జీవపు మాటలన్ మాధుర్యంబగు గానము మరలఁ బాడుము జీవమైన పాటన్ త్రోవఁజూపు మాటన్ ||దాపుఁజేరుచుఁ బాడుము||

1వ చరణం

నిత్యజీవము నిచ్చెడు నిపుణుఁ డేసుఁడు సత్యప్రేమ నొసంగెడు సదయుఁ డేసుఁడు మితిలేని ప్రేమ మింటికాకర్షించున్. ||దాపుఁజేరుచుఁ బాడుము||

2వ చరణం

ప్రచురపర్చుఁ డెల్లడన్ ప్రభుని రక్షణన్ దాచఁగూడని సత్యమున్ పూర్ణ క్షమాపణన్ రక్షకుని చెంత ఆశతోడ రండు ||దాపుఁజేరుచుఁ బాడుము||

Report Error