దైవాత్మా దిగుము దాసుల పైని

daivaathmaa digumu daasula paini

🎵 TG-238💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దైవాత్మా దిగుము దాసుల పైని నీ దయా దృష్టిఁ పారజేయుము ప్రేమన్ నింపు దేవా యాత్ముండ దిగుము మమ్ముల శుద్ధీకరించుము దయారసముచే ||దైవాత్మా దిగుము||

1వ చరణం

దైవాత్మా దిగుము ప్రవక్తలు పూర్వంబు నీదు ప్రేరణవలనఁ బ్రవచించిరి పావురమా దిగి మాలో వసించుము పాపుము చీఁకటి వెలుఁగుచు మాలో ||దైవాత్మా దిగుము||

2వ చరణం

రమ్ము ఓ యున్నతంపు ఆత్మా నాలుగు దెసల నుండి మమ్ముల నావ రించు రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు గానగు లోకుల మీదికి ముదమున ||దైవాత్మా దిగుము||

3వ చరణం

మే మజ్ఞానాంధకారమునను మునిఁగితిమి గాన చెదరఁగఁజేయు మంధకారము పామర జనులకుఁ బేర్మితో నొసఁగు ను జ్ఞాన ప్రకా శము నిల్పుము మాలో ||దైవాత్మా దిగుము||

Report Error