దైవజనులు కావాలి కావాలి

daivajanulu kaavaali kaavaali

🎵 TG-1293💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

దైవజనులు లేవాలి లేవాలి ప్రభుసేవకు పరుగులెత్తువారు ప్రభుకోసం ప్రాణమిచ్చెడివారు

1వ చరణం

నశించు పోవు దేశము కొరకు కన్నీరు కార్చెడి వారు పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు

2వ చరణం

ప్రభు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి కావాలి ఎలిషా వంటి వారు కావాలి లేవాలి

3వ చరణం

కోతెంతో విస్తారము కోసెడి పని వారు కొదువగా పొలములో పనిచేయుటకు వస్తావా నీవు వస్తావా నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది

Report Error