దేహం పాతది – మనసు

deeham paathadi – manasu

🎵 TG-2028🌐 Telugu
పల్లవి

దేహం పాతది – మనసు మలినమైనది జీవం పాపిది – మార్గం తెలియనిది (2) సర్వోన్నతుడా నిత్య నూతనుడా నిత్య జీవనం కలిగించుమయ్యా మరియా కన్న తనయా ||దేహం||

1వ చరణం

దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే ||సర్వోన్నతుడా||

2వ చరణం

తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు వీడగ లేని సంసారమనే బంధం విడిపించు నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు

Report Error