పల్లవి
దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందఁగా దేవా దేవా దీన పోషకా ||దేవ దాసపాలక||
1వ చరణం
లోకబాధ యిరుకు శోధన నుండి స్వీకరించినావు త్ర్యేకదేవుఁడా స్తోత్రం స్తోత్రం స్తోత్ర మర్పణ ||దేవ దాసపాలక||
2వ చరణం
దిక్కు లేని పాపికొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందఁగా ||దేవ దాసపాలక||
3వ చరణం
కఠిను లంత కుటిలముజేసి నిన్నుఁ గట్టి కొట్టి నెట్టి నీకుఁ గొయ్య నెత్తిరా యిదే నా యెడఁ బ్రేమఁ జూపితి ||దేవ దాసపాలక||
4వ చరణం
ఇంత యోర్పు యింత శాంతమా నాకై పంతముతోఁ బాపికొరకుఁ బ్రాణ మియ్యఁగా పాపిన్ నీదగు దాపుఁ జేర్చవే ||దేవ దాసపాలక||
5వ చరణం
కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వమోయఁగా హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్ ||దేవ దాసపాలక||