పల్లవి
దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి కాచినావు నీకు స్తోత్రము ||దేవ కావవే||
1వ చరణం
ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ తోడను ||దేవ కావవే||
2వ చరణం
నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో ||దేవ కావవే||
3వ చరణం
చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము దేవ ||దేవ కావవే||