దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతు‌డగు యెహొవా సంస్తుతి చేయవే మనసా

deeva sansthuthi cheeyavee manasaa shreemanthu‌dagu yehovaa sansthuthi cheeyavee manasaa

🎵 TG-1073🌐 Telugu
పల్లవి

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతు‌డగు యెహొవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా - నా జీవమా యెహొవా దేవుని పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించునో సమస్తమా ||దేవ||

1వ చరణం

జీవమా, యెహొవా నీకు జేసిన మేళ్లన్ మరవకు - నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే ||దేవ||

2వ చరణం

చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను - జీవ కిరీటముగ వేయును నీ శిరసు మీద - జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే ||దేవ||

3వ చరణం

యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త - యౌవనంబై వెలయునట్లుగ మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే ||దేవ||

4వ చరణం

పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు - భూమికన్న నాకసంబున్న యెత్తుండు దైవ - ప్రేమ భక్తి జనుల యందున ఆ కారణముచే ||దేవ||

5వ చరణం

పడమటికి దూర్పెంతయెడమో పాపములకును మనకునంత-యెడము కలుగజేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే ||దేవ||

6వ చరణం

మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి-మనము మంటివార మంచును జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపు చుండును ఆ కారణముచే ||దేవ||

Report Error