దేవ సంస్తుతి చేయుమా - నా జీవమా యెహొవా దేవుని పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించునో సమస్తమా “దేవ”
జీవమా, యెహొవా నీకు జేసిన మేళ్లన్ మరవకు - నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే “దేవ”
చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను - జీవ కిరీటముగ వేయును నీ శిరసు మీద - జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే “దేవ”
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త - యౌవనంబై వెలయునట్లుగ మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే “దేవ”
పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు - భూమికన్న నాకసంబున్న యెత్తుండు దైవ - ప్రేమ భక్తి జనుల యందున ఆ కారణముచే “దేవ”
పడమటికి దూర్పెంతయెడమో పాపములకును మనకునంత-యెడము కలుగజేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే “దేవ”
మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి-మనము మంటివార మంచును జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపు చుండును ఆ కారణముచే “దేవ”