దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా

deevaa mahoonnathudaa mahimaa prakaashithudaa

🎵 TG-1670🌐 Telugu
పల్లవి

దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా (2) పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా (2)         ||దేవా||

1వ చరణం

వెలిసావు భువిలో మెస్సయ్యగా ఎడారి బ్రతుకులో సెలయేరుగా నిస్సారమైన నా జీవితములో చిగురించె ఆనందము (2)          ||దేవా||

2వ చరణం

లేచాను ఒంటరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినై నీ దివ్య మార్గము దర్శించినా ఫలియించె నా జన్మము (2)        ||దేవా||

Report Error