దేవా శిశువుల( దెచ్చితిమి నీవు

deevaa shishuvula( dechchithimi neevu

🎵 TG-272💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవా శిశువుల( దెచ్చితిమి నీవు దీవించువీరల దివ్య కృపమీర ||దేవా శిశువుల(||

1వ చరణం

వీరు పొందిన బాప్తిస్మంబు గురుతు వీరు నీవా రన విశదపరపంగా వీరిపైఁ గురిపించు దయను వేగ వీరికిఁ గలుగంగ విజ్ఞాన ధనము ||దేవా శిశువుల(||

2వ చరణం

నీ వొసఁగు శిశువుల మాకు దేవ నీవ చేర్చికొనుము నీవ కాపాడు జీవ మార్గము నందు నిలుపు నిత్య జీవంబు దయచేసి శ్రీ యేసు కఠినన్ ||దేవా శిశువుల(||

3వ చరణం

విమలాత్మ బాప్తిస్మ మొసఁగి వీరి విమలులఁ జేయుము ప్రీతిని దేవా క్షమ భక్తిప్రేమ శాంతుల నొసంగు శ్రమముల వెలుఁగంగ సత్య సాక్షులుగా ||దేవా శిశువుల(||

4వ చరణం

వీరలకుఁ దోడై యుండుము తండ్రి వీరలఁ జూడుము వివిధ మార్గ ముల వీరు లోకము విడుచు నపుడు దయను వీరలఁ జేర్చుము విమ లానందమున ||దేవా శిశువుల(||

Report Error